సుమారు 500 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత అయోధ్యలో జరగబోతున్న దీపావళి వేడుకలు చరిత్రాత్మకమని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఇవి రామ్‌లల్లా తన సొంతింటికి వచ్చిన తర్వాత జరుగుతున్న తొలి దీపావళి వేడుకలని, వీటి కోసం ఎన్నో తరాలు వేచి చూశాయని అన్నారు. ‘‘ఇప్పటి తరం ఎంతో అదృష్టం చేసుకుంది. రామ్‌లల్లా తన జన్మస్థలానికి చేరుకున్నాడు. మనమంతా వేడుకలను ఘనంగా నిర్వహించుకోవాలి’’ అని మోడీ పిలుపునిచ్చారు.