AP: ఏలూరు జిల్లాలోని చింతలపూడిలో విషాదం చోటుచేసుకుంది. సాయి స్ఫూర్తి ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యానికి తల్లి, బిడ్డ మృతి చెందారు. కోడూరి పరిమళ కిరణ్ పురిటి నెప్పులతో ఆదివారం ఆసుపత్రిలో అడ్మిట్ చేయగా అర్థరాత్రి ప్రసవం చేయటంతో పురిట్లోనే బిడ్డ కూడా చనిపోయింది. సాయి స్ఫూర్తి హాస్పిటల్‌లో డాక్టర్ లేకుండానే ప్రసవం చేశారని బంధువులు ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.