విజయవాడ గురునానక్ కాలనీలో జరుగుతున్న హైటెక్ వ్యభిచారం గుట్టు రట్టు అయింది. పక్కా సమాచారంతో స్పా సెంటర్ ముసుగులో ఉన్న వ్యభిచార గృహంపై పోలీసులు దాడి చేశారు. ఈ క్రమంలో వైసీపీ నేత, ఎస్టీ కమిషన్ మాజీ సభ్యుడు శంకర్ నాయక్ పట్టుబడ్డారు. మంచం కింద దాక్కున్న ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన స్వస్థలం సత్యసాయి జిల్లా ధర్మవరం. ఈ నెల 9వ తేదీ వరకు ఆయన ఎస్టీ కమిషన్ సభ్యుడిగా కొనసాగారు.