హోం మంత్రి అనిత సంచలన వ్యాఖ్యలు

80చూసినవారు
హోం మంత్రి అనిత సంచలన వ్యాఖ్యలు
ఏపీ హోం మంత్రి అనిత సంచలన వ్యాఖ్యలు చేశారు. సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న ఆమె మీడియాతో మాట్లాడుతూ.. దేవస్థానం భూములు అన్యాక్రాంతం కాకుండా చూస్తానని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వానికి కొందరు అధికారులు తొత్తులుగా వ్యవహరించారని, అలాంటి పనులు మానుకోవాలని సూచించారు. మాసీ సీఎం జగన్‌పై ఇంకా ప్రేమ ఉంటే ఆ అధికారులు వెంటనే రాజీనామా చేయాలని సంచలన వ్యాఖ్యలు చేశారు.