2,100 అణ్వాయుధాలు ప్రయోగానికి సిద్ధం

51చూసినవారు
2,100 అణ్వాయుధాలు ప్రయోగానికి సిద్ధం
రష్యా, ఉక్రెయిన్.. ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధాలు కొనసాగుతున్న వేళ, ప్రపంచ దేశాలు తమ రక్షణ కోసం పూర్తిగా అణ్వస్త్రాలనే నమ్ముకున్నాయని సిప్రి నివేదిక వెల్లడించింది. ఏటా ఈధోరణి మరింత పెరుగుతోందని పేర్కొంది. అభివృద్ధి దశలో ఉన్న అణ్వాయుధాల సంఖ్య సైతం ఎగబాకిందని తెలిపింది. 2024 జనవరి నాటికి ప్రపంచవ్యాప్తంగా 12,121 అణ్వస్త్రాలు ఉన్నాయని తెలిపింది. వీటిలో 9,585 ఆయుధాలు సైనిక నిల్వ కేంద్రాల్లో ఉన్నట్లు పేర్కొంది.

సంబంధిత పోస్ట్