ఏపీ హోంమంత్రి అనిత మానవత్వం చాటుకున్నారు. విశాఖలోని పాత గాజువాక జంక్షన్ లో ఓ బైకును ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్ పై ఉన్నవారికి గాయాలయ్యాయి. అదే సమయంలో అటుగా వెళ్తున్న హోమంత్రి అనిత.. వారిని గమనించారు. వెంటనే కాన్వాయ్ ని ఆపించి బాధితుల వద్దకు వెళ్లి సహాయచర్యలు చేపట్టారు. వారిని తక్షణమే ఆసుపత్రికి తరలించి, మెరుగైన వైద్యం అందేలా చూడాలని తన సిబ్బందిని ఆదేశించారు.