నేను క్షేమంగా ఉన్నాను.. కువైట్ బాధితుడు (వీడియో)

76చూసినవారు
ఏపీలోని అన్నమయ్య జిల్లా చింతపర్తికి చెందిన శివ కువైట్‌లో బతకలేకపోతున్నా.. నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్లండని చెప్పిన ఓ వీడియో నెట్టింట వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ వీడియోపై స్పందించిన మంత్రి నారా లోకేష్ భారత ఎంబసీని సంప్రదించి.. శివను ఇండియాకు తీసుకురావాలని కోరాడు. దాంతో శివను ఎంబసీ సంప్రదింపులు జరిపింది. ప్రస్తుతం అతను ఎంబసీలో క్షేమంగా ఉన్నాడు. తన బాధను అర్థం చేసుకుని, తనకు సహకరించిన ప్రతిఒక్కరికి శివ కృతజ్ఞతలు తెలిపాడు.