పట్టా భూముల్లో ఇసుక తవ్వకాలకు ఈసీ అవసరముంది. కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ పరిధిలో పనిచేసే రాష్ట్రస్థాయి పర్యావరణ మదింపు సంస్థ (సియా) ఈ అనుమతులు ఇస్తుంది. ఎస్‌ఈఏసీ ఆమోదించిన తర్వాత, సియా పర్యావరణ అనుమతులు ఇస్తుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అప్పటివరకూ ఉన్న సియా, ఎస్‌ఈఏసీ కమిటీలు రాజీనామాలు చేశాయి. ఇప్పుడు ఈ రెండు కమిటీలను నియమిస్తే తప్ప అనుమతులు జారీ అయ్యే అవకాశం లేదని గనులశాఖ అధికారులు చెబుతున్నారు.