ఇసుక డోర్ డెలివరీకి వాహనదారులు వసూలు చేయాల్సిన ఛార్జీలపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. రీచ్, స్టాక్ పాయింట్ నుంచి 10 కి.మీ.లోపు దూరమైతే.. టన్నుకు, కిలోమీటరుకు రూ.12 చొప్పున ధర నిర్ణయించాలని ప్రతిపాదిస్తున్నారు. దూరం పెరిగే కొద్దీ ధర తగ్గనుంది. గరిష్ఠంగా 40 కి.మీ. కంటే ఎక్కువ దూరముంటే టన్నుకు, కిలోమీటరుకు రూ.6 చొప్పున ధర నిర్ణయించనున్నారు. ఈ ఛార్జీలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చాక అధికారికంగా ఖరారు చేయనున్నారు.