మాఘమాసం ఆరంభం కావడంతో శుక్రవారం నుంచి శ్రీరస్తు.. శుభమస్తు.. కల్యాణమస్తు.. సందడి మొదలైంది. శుభ ముహూర్తంలో మూడు ముళ్ల బంధంతో వేలాది జంటలు ఒక్కటి కానున్నాయి. ఈ నెల 31, ఫిబ్రవరి 2, 7, 13, 14, 16, 20, 22, 23, మార్చి 2, 6, 7, 12, 14, 15, 16, ఏప్రిల్ 9, 10, 11, 12, 13, 16, 18, 20, 23, 29, 30, మే 1, 7, 8, 9, 10, 11, 14, 15, 16, 17, 18, 21, 22, 23, 28 తేదీల్లో కళ్యాణ ఘడియలు ఉన్నట్లు పండితులు తెలిపారు.