27 ఏళ్ల తర్వాత.. కుంభమేళాలో కనిపించిన భర్త

53చూసినవారు
27 ఏళ్ల తర్వాత.. కుంభమేళాలో కనిపించిన భర్త
27 ఏళ్ల క్రితం ఇల్లు విడిచి వెళ్లిపోయిన ఓ వ్యక్తి యూపీలోని ప్రయాగ్‌రాజ్ కుంభమేళాలో కనిపించారు. ఝార్ఖండ్‌కు చెందిన గంగాసాగర్ యాదవ్ 1998లో ఉన్నట్టుండి అదృశ్యమయ్యారు. ఈయనకు భార్య ధన్వాదేవి, కుమారులు కమలేశ్, విమలేశ్ ఉన్నారు. అదృశ్యమైన గంగాసాగర్ కోసం ఎంత వెతికినా ప్రయోజనం లేకపోయింది. తాజాగా జరుగుతున్న కుంభమేళాకు ధన్వాదేవి బంధువులు గంగాసాగర్‌ను గుర్తుపట్టి ఆమెకు సమాచారమిచ్చారు. అయితే తాను గంగాసాగర్ కాదని చెప్పడంతో డీఎన్ఏ పరీక్షకు సిద్ధమయ్యారు.

సంబంధిత పోస్ట్