పవన్ కుమార్తెలపై అనుచిత వ్యాఖ్యలు.. కేసు నమోదు

67చూసినవారు
పవన్ కుమార్తెలపై అనుచిత వ్యాఖ్యలు.. కేసు నమోదు
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఆయన కుటుంబంపై ఎక్స్‌లో అనుచిత వ్యాఖ్యలు చేసిన ‘ఎఫ్ రెడ్డి’ అనే హ్యాండిల్‌పై విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. జనసేన నేత జయలక్ష్మి ఎఫ్ రెడ్డిపై ఫిర్యాదు చేశారు. పవన్ కుమార్తెల ఫోటోలు పోస్ట్ చేసిన సదరు వ్యక్తి తీవ్ర పదజాలంతో అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని పోలీసులు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్