ఏపీలో క్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 35 డిగ్రీలకు పైగా సగటు ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. అధికారుల తాజా లెక్కల ప్రకారం గురువారం కర్నూలు జిల్లాలోని సి.బెలగల్‌లో 35.9 సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే సత్యసాయి జిల్లా కొత్త చెరువులో, నంద్యాల, కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్, ప్రకాశం జిల్లా కనిగిరిలో కూడా 35.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు తెలిపారు.