అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న భారతీయులను అగ్రరాజ్యం ప్రత్యేక విమానంలో వెనక్కి పంపిన సంగతి తెలిసిందే. అలా తొలివిడతలో 104 మంది భారతీయులు సీ-17 విమానంలో బుధవారం అమృత్‌సర్ చేరుకున్నారు. అయితే, భారత వలసదారుల చేతులకు సంకెళ్లు.. కాళ్లకు గొలుసులు ఉండటంతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. రాజకీయ వివాదానికి దారితీసింది. ఈనేపథ్యంలో కేంద్రం దీనిపై స్పందించింది. ఆ ఫొటోల్లో ఉన్నది భారతీయులు కారని స్పష్టం చేసింది.