అసెంబ్లీలో ఇంకా సీట్ల కేటాయింపు జరగకపోవడంతో మాజీ సీఎం జగన్‌కు ముందు వరుసలో సీటు దక్కడం కష్టమేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. సాధారణ సభ్యుడిగానే ఆయన ఎక్కడో ఓ చోట కూర్చోవాల్సి ఉంటుందని చెబుతున్నారు. తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని జగన్ విజ్ఞప్తి చేస్తున్నారు. కానీ 11 సీట్లే రావడంతో ప్రతిపక్ష హోదా ఇవ్వలేమని అధికారపక్షం తేల్చి చెబుతోంది. కాగా రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.