పంజాబ్-హర్యానా సరిహద్దు ప్రాంతం శంభు వద్ద మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శనివారం మధ్యాహ్నం ‘ఢిల్లీ చలో’ మార్చ్‌ను ప్రారంభించిన రైతులను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయువు, జల ఫిరంగులను ప్రయోగించారు. కనీస మద్దతు ధర సహా 11 డిమాండ్ల సాధన కోసం 101 మంది అన్నదాతలు ఈ మార్చ్‌లో పాల్గొన్నారు. మూడోసారి రైతుల ప్రయాత్నాన్ని పోలీసులు భగ్నం చేశారు.