AP: రాష్ట్రవ్యాప్తంగా 40 విజిలెన్స్ అధికారుల బృందాలు గిడ్డంగులు, ఎరువుల దుకాణాలపై ఒకేసారి ఆకస్మిక తనిఖీలు చేశాయి. ఈ సోదాల్లో ఎరువులను అధిక ధరలకు అమ్ముతున్నట్లు అధికారులు గుర్తించారు. లైసెన్సులు లేకుండా విక్రయాలు, తూకాల్లో లోపాలు ఉన్నట్లు బయటపడింది. రైతులను ఇబ్బంది పెట్టవద్దని, రాష్ట్రవ్యాప్తంగా ఈ దాడులు కొనసాగుతాయని విజిలెన్స్ డీజీ ప్రకటించారు.