చాట్ జీపీటీ మాతృ సంస్థ ఓపెన్ ఏఐ వేగు సుచిర్ బాలాజీ (26) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. శాన్‌ఫ్రాన్సిస్కోలోని తన నివాసంలో సుచిర్ బాలాజీ విగత జీవిగా కనిపించారు. ఓపెన్ ఏఐ ఆపరేషన్లు, అనుసరిస్తున్న విధానాలు ఆందోళనకరంగా ఉన్నట్లు గతంలో తన రీసెర్చ్ ద్వారా సుచిర్ బాలాజీ వెల్లడించారు. నవంబర్ 26న అతను చనిపోగా.. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.