రైతులు తమ డిమాండ్లను పరిష్కరించాలని శనివారం మధ్యాహ్నం చలో ఢిల్లీకి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రైతులు ఢిల్లీ చేరుకునేందుకు సన్నాహాలు మొదలు పెట్టారు. అయితే రైతులు దేశ రాజధానిలోకి ప్రవేశించకుండా పోలీసులు ఇప్పటికే ఢిల్లీ సరిహద్దుల్లో పెద్ద ఎత్తున బారీకేడ్లను ఏర్పాటు చేశారు. మరోవైపు హర్యానా సర్కార్ కూడా అంబాలా జిల్లాలో తాత్కాలికంగా ఇంటర్నెట్ సేవలు, మొబైల్ ఎస్‌ఎంఎస్ సేవలను ఆపేసింది.