TG: జగిత్యాల ప్రధాన ఆస్పత్రిలో రోగులను పట్టించుకోకుండా నర్సులు, సిబ్బంది డాన్స్ వేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అధికారులు విచారణకు ఆదేశించారు. క్రిస్మస్ వేడుకల్లో భాగంగా నర్సులు, సిబ్బంది కోలాటం, డాన్స్ రిహార్సల్ చేశారు. పేషెంట్ల పక్క రూమ్‌లోనే వీరు డ్యాన్స్ వేశారు. ఈ విషయం తెలుసుకున్న అడిషనల్ కలెక్టర్ గౌతమ్ రెడ్డి ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.