ఏపీలో రానున్న 4 రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, అది రేపటికి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో తీరప్రాంతమైన కోస్తాంధ్రలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని, సోమవారం నుంచి 17వ తేదీ వరకు కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది.-