గత ఐదేళ్ల పాలనలో జగన్ రాష్ట్రంలో విధ్వంసం సృష్టించారని.. ఆయన ఒక ఆర్థిక ఉగ్రవాది అని మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో విమర్శించారు. తాజాగా అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర సంపదను పెంచకుండా విపరీతంగా అప్పులు చేశారని జగన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. బిల్లులను పెండింగ్ లో పెట్టడంతో అనేక మంది కాంట్రాక్టర్లు ఆత్మహత్య చేసుకున్నారని జగన్‌పై విమర్శలు చేశారు.