టాయిలెట్ ఫ్లష్‌లో శిశువు మృతదేహం

75చూసినవారు
టాయిలెట్ ఫ్లష్‌లో శిశువు మృతదేహం
కర్ణాటకలోని హరోహళిలో దారుణ ఘటన వెలుగుచూసింది. అప్పుడే పుట్టిన పసికందును బాత్రూమ్ కమోడ్‌లో పడేసి ఫ్లష్ చేసి వెళ్లిపోయారు. కమోడ్‌లో నీరు నిలిచిపోవడంతో కార్మికులు శుభ్రం చేస్తుండగా పసికందు మృతదేహాన్ని గుర్తించారు. శిశువుకు 2 రోజుల వయసుంటుందని ఆసుపత్రి అధికారులు తెలిపారు. పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన వారెవరో ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్