వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్కు ఎన్నడూ లేని పెద్ద కష్టమే వచ్చిన విషయం తెలిసిందే.జగన్ ఇప్పుడు ఆస్తుల వివాదాల్లో చిక్కుకున్నారు. ఆనాడు వెన్నంటి ఉన్న తల్లి-చెల్లి దూరమయ్యారు.జగన్ బాధను ప్రపంచ బాధ చేయాల్సిన, దాని నుంచి సింపతీని పిండాల్సిన అవసరం వైసీపీ కేడర్ పైనే ఉంది. అయితే.. ఖచ్చితంగా ఇప్పుడే.. ఆ కేడర్ కూడా దూరంగా ఉంటుండడం గమనార్హం. దీనికి కారణం.. అధికారంలో ఉన్నప్పుడు తమకు ఏమీ చేయలేదన్న వాదన, తమకు కనీసం దర్శనం కూడా ఇవ్వలేదన్న బాధ రెండూ ఉన్నాయి.