బాలీవుడ్ ప్రాజెక్టుపై ఏడాది క్రితమే చర్చలు జరిగాయని నటుడు సూర్య తెలిపారు. ‘కంగువా’ ప్రచారంలో భాగంగా ఇవాళ ముంబయి వెళ్లిన ఆయన ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. యాంకర్ అడగ్గా ‘‘ఓ సినిమా సెట్స్‌పైకి వెళ్లాలంటే చాలా ప్రాసెస్ ఉంటుంది. ఏడాది క్రితమే దానిపై చర్చలు జరిగాయి. ఆ సినిమాని నిర్మాతలు ప్రకటిస్తేనే బాగుంటుంది. అందుకే నేను ఇప్పుడు ఏం చెప్పలేకపోతున్నా’’ అని సూర్య అన్నారు.