Dec 02, 2024, 12:12 IST/
మా ప్రభుత్వానికి తొలి ప్రాధాన్యత విద్య, వైద్యం: CM
Dec 02, 2024, 12:12 IST
తమ ప్రభుత్వానికి తొలి ప్రాధాన్యత విద్య, వైద్యం అని CM రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ మార్గ్ - HMDA గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన సభలో సీఎం పాల్గొని మాట్లాడారు. దేశంలోనే అత్యధిక డాక్టర్లను అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని చెప్పారు. ఏడాదిలోనే 14 వేల మందిని వైద్యారోగ్య శాఖలో నియమించడం ఒక చరిత్ర అని వ్యాఖ్యానించారు. BRS ప్రభుత్వం 8 వైద్య కళాశాలలు ఇచ్చి ఎలాంటి వసతులు కల్పించలేదన్నారు.