AP: జనసేన అధినేత, డిప్యూటి సీఎం పవన్ కళ్యాణ్‌పై మంత్రి కందుల దుర్గేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. డిప్యూటీ సీఎం లేకుంటే తాను మంత్రిని అయ్యేవాడిని కాదని హర్షం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో నిడదవోలు నియోజకవర్గానికి వెళ్లమనడంతో అక్కడికి వెళ్లాలా? వద్దా? అనే సందిగ్ధంలో ఉండిపోయానని. అప్పుడు ఆయన ధైర్యం చెప్పారని అన్నారు. గెలిచిన తర్వాత మంత్రివర్గంలో పెట్టే బాధ్యత తాను తీసుకుంటానని భరోసా ఇచ్చారని గుర్తుచేశారు.