మా లక్నో సూపర్ జెయింట్స్ జట్టులో రిషభ్ పంత్, పూరన్, మార్‌క్రమ్, మిచెల్ మార్ష్ అనే నలుగురు లీడర్లు ఉన్నారని LSG యజమాని సంజీవ్ గొయెంకా పేర్కొన్నారు. మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రాతో గోయెంకా మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 'మా మిడిల్ ఆర్డర్, ఫినిషింగ్ చాలా బలంగా ఉండాలని అనుకున్నాం. ఇప్పుడు మా టీమ్ చాలా బలంగా ఉంది. పంత్ వచ్చే 10-12 ఏళ్లు మాతో ఉంటాడని ఆశిస్తున్నా.' అని గోయెంకా అన్నారు.