ఉత్తరప్రదేశ్‌లో పట్టపగలే దొంగలు రెచ్చిపోయారు. లక్నోలోని వికాస్‌నగర్‌లో నంబర్ ప్లేట్ లేని బైక్‌పై వచ్చిన ఇద్దరు ఈ యువతి చేతిలోని పర్సును దొంగిలించారు. వారు పర్సు లాక్కునే సమయంలో ఆమె పర్సును గట్టిగా పట్టుకోవడంతో కింద పడిపోయింది. దీంతో ఆమెను కొంతదూరం ఈడ్చుకెళ్లారు. తర్వాత పర్సు లాక్కొని పారిపోయారు. కాగా, బాధితురాలిని జాంకీపురం గార్డెన్‌లో నివసిస్తున్న రీనా చౌహాన్‌గా గుర్తించారు. ఆమె తండ్రి ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్నారు.