నటి శోభితా ధూళిపాళ్ల మరో రెండు రోజుల్లో బ్యాచిలర్ జీవితానికి గుడ్ బై చెప్పనున్నారు. నటుడు నాగచైతన్యతో బుధవారం ఆమె వివాహం జరగనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఇరు కుటుంబాల్లో పెళ్లి వేడుకలు ప్రారంభమయ్యాయి. కాబోయే వధూవరులకు ఇటీవల మంగళ స్నానాలు చేయించారు. ఈ నేపథ్యంలోనే ఆమెను సోమవారం పెళ్లికుమార్తెగా ముస్తాబు చేశారు. మంగళ హారతులు ఇచ్చారు. దీనికి సంబంధించిన ఫొటోలను శోభిత తాజాగా నెటిజన్లతో పంచుకున్నారు.