కడప జిల్లా బద్వేల్ పట్టణం మైదుకూరులోని గౌరీ సాయి వైన్స్ వద్ద మద్యం మత్తులో ఒకరిపై ఒకరు దాడికి దిగారు. ఈ దాడిలో అక్రమ్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. మద్యం దుకాణంలో రెండు గంటల నుండి పది మంది వ్యక్తులు మద్యం సేవిస్తూ మాట మాట పెరిగి ఘర్షణకు దారి తీసి చివరకు కత్తులతో దాడికి దిగినట్లుగా తెలిసింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.