చిన్న మండ్యం: పశుగణన కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలి
సోమవారం చిన్నమండ్యం మండలం బోరెడ్డి గారిపల్లెలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి 21వ అఖిల భారత పశుగణన పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా, పశు గణాంకాలు ప్రభుత్వానికి పాడి రైతులకు లబ్ధి అందించడంలో సహాయపడతాయని అన్నారు. అందుకుగాను, అన్నమయ్య జిల్లాలోని పాడి రైతులు, తమ పశువులు, గొర్రెలు, మేకలు, కోళ్ల వివరాలను పశుసంవర్ధక శాఖ అధికారులకు తెలియజేయాలని ఆయన కోరారు.