Sep 25, 2024, 13:09 IST/
CPR చేసి వృద్ధుడి ప్రాణాలు కాపాడిన పోలీసులు (వీడియో)
Sep 25, 2024, 13:09 IST
గుండెపోటు వచ్చి పడిపోయిన వృద్ధుడిని పోలీసులు సీపీఆర్ చేసి కాపాడారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో జరిగింది. రాత్రి 10 గంటల ప్రాంతంలో ఇద్దరు వృద్ధులు ఫోన్ మిస్సింగ్ ఫిర్యాదు ఇవ్వడానికి ఆగ్రాలో ఉన్న GRP పోలీస్ స్టేషన్కు వచ్చారు. ఫిర్యాదు చేస్తున్న సమయంలో వారిలో ఓ వృద్ధుడు అకస్మాత్తుగా కింద పడిపోయాడు. వెంటనే స్పందించిన హెడ్ ఆఫీసర్ రాకేష్ కుమార్, కానిస్టేబుల్ రవీంద్ర చౌదరిలు సీపీఆర్ చేసి వృద్ధుడిని కాపాడారు.