బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాలతోపాటు, పలు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ తరుణంలో భారత వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. పశ్చిమ మధ్య, దానిని ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతం ఉత్తరాంధ్ర-దక్షిణ ఒడిశా తీర ప్రాంతాల్లో ఏర్పడిన నిన్నటి అల్పపీడనము పశ్చిమ వాయవ్య దిశగా పయనించి ఈరోజు తక్కువగా గుర్తించినట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో వచ్చే మూడు రోజులపాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.