పాఠాలు చెప్పమంటే.. టీచర్ మమ్మల్ని బూతులు తిడుతున్నారు (వీడియో)

580చూసినవారు
తెలంగాణలోని నిర్మల్ జిల్లా గోసంపల్లె ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ముగ్గురు టీచర్లు బదిలీ అయ్యారు. ప్రస్తుతం ఉన్న టీచర్ తమకు పాఠాలు చెప్పకుండా నిత్యం ఫోన్ మాట్లాడుతున్నాడని, అడిగితే బూతులు తిడుతున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ఆ టీచర్ వద్దని, వేరే టీచర్ కావాలని కోరారు. స్కూల్ లో మరుగుదొడ్లు సరిగా లేవని, క్లాస్ రూమ్ లోనే మందుబాబులు మద్యం సేవిస్తున్నారని పిల్లల పేరెంట్స్ ఆరోపిస్తున్నారు.

సంబంధిత పోస్ట్