ఉత్తర్‌ప్రదేశ్ లోని గ్రేటర్ నోయిడాలో మ్యాట్రిమోనియల్ సైట్ల ద్వారా మహిళలను మోసం చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. రాహుల్ చతుర్వేది అనే వ్యక్తి మహిళలకు పెళ్లి హామీ ఇచ్చి మ్యాట్రిమోనియల్ సైట్ల సాయంతో మోసం చేసేవాడు. నిందితుడు తనను తాను ఐఐఎం గ్రాడ్యుయేట్‌గా చెప్పుకుంటున్నాడు. తాను ఓ పెద్ద కంపెనీలో ఉన్నత స్థానంలో పనిచేశానని మహిళలకు చెప్పేవాడు. 20మందికి పైగా మహిళలు అతని వలలో పడి భారీగా డబ్బు పోగొట్టుకున్నట్లు సమాచారం.