40 నిమిషాల ముందే పిడుగుపాటు గురించి హెచ్చరించే యాప్ 'దామిని'

84చూసినవారు
40 నిమిషాల ముందే పిడుగుపాటు గురించి హెచ్చరించే యాప్ 'దామిని'
మీ చుట్టుపక్కల 20-40 కి.మీ. పరిధిలో ఎక్కడ పిడుగులు పడే అవకాశం ఉందనే విషయాన్ని 40 నిమిషాల ముందే హెచ్చరించే యాప్ ‘దామిని’. ఈ యాప్ ను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇది ప్లే స్టోర్ లో అందుబాటులో ఉంది. జీపీఎస్ ఆధారంగా స్థానికంగా సంభవించే పిడుగుపాట్ల గురించి హెచ్చరికలు చేయడంతో పాటు, దేశవ్యాప్తంగా ఎక్కడ పిడుగులు పడుతున్నాయనే సమాచారాన్ని ఈ యాప్ అందిస్తుంది. ఏటా పిడుగుపాటుతో దేశవ్యాప్తంగా 2,500 మరణాలు సంభవిస్తున్నాయి.

సంబంధిత పోస్ట్