ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్ జిల్లాలో మంగళవారం షాకింగ్ ఘటన జరిగింది. ఓ పాఠశాలలో సంజయ్ గుప్తా అనే టీచర్.. 6వ తరగతి విద్యార్థినిని ఫెయిల్ చేస్తానని బెదిరించి, ఆమెపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించి గదిలోకి తీసుకెళ్లాడు. ఈ నేపథ్యంలో టీచర్ బాలికను బలవంతం చేస్తుండగా.. కేకలు వేయడంతో స్థానికులు టీచర్ ను పట్టుకుని దారుణంగా కొట్టారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.