చిట్వేలు: ఫ్రీ హోల్డ్ భూముల సర్వే త్వరితగతిన పూర్తి చేయండి
చిట్వేలు మండలంలో డికేటి ఫ్రీ హోల్డ్ భూముల రీ సర్వే త్వరితగతిన పూర్తి చేయాలని గ్రామ రెవెన్యూ అధికారులను స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ బి. లీలా రాణి కోరారు. మంగళవారం చిట్వేలు రెవెన్యూ కార్యాలయంలో గ్రామ రెవెన్యూ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఫ్రీ హోల్డ్ డీకేటి భూముల సర్వే తప్పులకు తావులేకుండా పారదర్శకంగా చేయాలని ఆమె కోరారు. కార్యక్రమంలో గ్రామ రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.