సిద్ధవటం మండలానికి 3.29 కోట్లు విడుదల

57చూసినవారు
సిద్ధవటం మండలానికి  3.29 కోట్లు విడుదల
కడప జిల్లా సిద్ధవటం మండలంలో వైఎస్ఆర్ చేయూత పథకానికి 3. 29 కోట్ల రూపాయలు అందించామని రాజంపేట శాసనసభ్యులు మేడా మల్లికార్జున రెడ్డి అన్నారు. ఆయన శుక్రవారం ఒంటిమిట్ట మండల పరిధిలోని ఎంపీడీవో సభా భవనం నందు వైయస్సార్ చేయూత పథకాన్ని విడుదల చేశారు.

ఆయన మాట్లాడుతూ ఒంటిమిట్ట మండలం లో 1754 మందికి లబ్ధి చేకూరిందని అన్నారు. 45 నుండి 60 సంవత్సరాల మధ్య గల బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందిన మహిళలకు చేయూత అందించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సిద్ధవటం మండల వైకాపా నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్