ఐరన్ ఓర్ లోడుతో వెళ్తున్న లారీ బుధవారం కడప-తాడిపత్రి ప్రధాన రహదారిలో కొండాపురం మండలం పీ. అనంతపురం సమీపంలో బోల్తా పడింది. హోస్పెట్ నుంచి శ్రీకాళహస్తికి ఐరన్ ఓర్ గోలి లోడుతో వెళ్ళుతున్న లారీ ఈ ప్రమాదానికి గురైంది. స్థానికుల సమాచారం మేరకు, అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.