పెండ్లిమర్రి: ప్రతి ఒక్కరు మొక్క నాటాలి: ఎంఈవో
ప్రతి ఒక్కరూ వారి అమ్మ పేరుతో ఒక మొక్క తప్పకుండా నాటాలని పెండ్లిమర్రి మండల విద్యాధికారి పి. సుజాత శనివారం అన్నారు. నెహ్రూ యువ కేంద్ర కడప వారి ఆధ్వర్యంలో..పెండ్లిమర్రిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అమ్మ పేరుతో మొక్క నాటుదాం అనే కార్యక్రమానికి ఎంఈఓలు పి. సుజాత, గంగాధర్ నాయక్ లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్బంగా వారు విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు.