వివాహితకు వేధింపులు..యువకుడికి దేహశుద్ధి
వివాహితకు ఫోన్ కాల్స్ చేసి వేధిస్తున్న ప్రసాద్ రెడ్డి అనే యువకుడిని బాధిత యువతి బంధువులు పట్టుకుని దేహశుద్ధి చేశారు. సోమవారం కడప జిల్లా పెండ్లిమర్రి మండలం నల్లయ్యగారిపల్లెలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రసాద్ రెడ్డిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.