కమలాపురం: అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
పెండ్లిమర్రి మండలంలోని యెల్లటూరు రాజీవ్ నగర్ కు చెందిన పార్ల పుల్లారెడ్డి(57) అనే రైతు సోమవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన బంధువులు హుటాహుటిన కడప రిమ్స్ కు తీసుకెళ్తుండగా మార్గ మధ్యంలో మృతి చెందాడు. అప్పుల బాధ తాళలేక ఇంట్లో పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపిన తెలిపారు.