కడప: వివేకా హత్య కేసు నిందితుడికి బెయిల్

84చూసినవారు
కడప: వివేకా హత్య కేసు నిందితుడికి బెయిల్
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మరో నిందితుడు గజ్జల ఉమాశంకర్ రెడ్డికి హైకోర్టు భారీ ఊరట కల్పించింది. ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ప్రతి శనివారం పులివెందుల సీఐ ముందు హాజరుకావాలని ఆదేశించింది. ప్రస్తుతం గజ్జల ఉమాశంకర్ రెడ్డి చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఉదయ్ కుమార్ రెడ్డికి ఇప్పటికే బెయిల్ మంజూరైన విషయం తెలిసిందే.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్