వేముల మండలం కొండ్రెడ్డిపల్లి గ్రామంలో వెలసిన శ్రీ మోపూరి భైరవేశ్వరస్వామి దేవస్థానంలో సోమవారం సాయంత్రం ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి స్వామివారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారని, ఆలయ ఛైర్మన్ వెంకటరమణా రెడ్డి తెలిపారు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఆలయంలో భైరవేశ్వరుడికి ఎమ్మెల్సీ కుటుంబ సభ్యులతో కలిసి అభిషేకం, తదితర ప్రత్యేక పూజలు నిర్వహించారని తెలిపారు.