వికసిత
భారత్ లక్ష్యంగా భాజపా సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టినట్టు భాజపా జిల్లా ప్రధాన కార్యదర్శి హరిప్రసాద్ తెలిపారు. శుక్రవారం వేంపల్లెలో విలేకరుల సమావేశంలో పార్టీ సీనియర్ నాయకుడు బొమ్మిరెడ్డి లక్ష్మారెడ్డికి క్రియాశీలక సభ్యత్వం ఇచ్చారు. వేంపల్లి అన్ని ప్రాంతాల్లో తిరిగి ఆన్లైన్ ద్వారా మోడీ అభిమానులకు భాజపా సభ్యత్వం ఇవ్వడం జరిగిందన్నారు. ఇప్పటికే 15వేల మందికి సభ్యత్వం ఇవ్వడం జరిగిందని అన్నారు.