గురజాడ సమాజం అభివృద్ధికి అడుగుజాడ

56చూసినవారు
గురజాడ సమాజం అభివృద్ధికి అడుగుజాడ
గురజాడ వెంకట అప్పారావు సమాజాభివృద్ధికి అడుగుజాడని యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలెం మహేష్ బాబు అన్నారు. శనివారం ఒంటిమిట్ట మండలం పెన్న పేరూరు ప్రాథమికోన్నత పాఠశాల యందు గురజాడ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలోని సాంఘిక దురాచారాలను రూపుమాపడానికి నిరంతరం కృషి చేశారని, బాల్య వివాహాలు, సతీ సహగమనం రూపు మాపడానికి ఆయన శాయశక్తుల కృషి చేశారని తెలిపారు. ‌
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్