అన్నమయ్య జిల్లాకు 29 కోట్లతో క్రిటికల్ కేర్ యూనిట్ మంజూరు అయిందని, యూనిట్ ద్వారా రోడ్డు ప్రమాదాలకు గురైన క్షతగాత్రులకు తక్షణం మెరుగైన వైద్యం అందుతుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. సోమవారం రాయచోటి మంత్రి క్యాంపు కార్యాలయంలో వైద్యాధికారులతో సమావేశ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ త్వరలో క్రిటికల్ కేర్ యూనిట్ ను ప్రజలకు అనుకూలమైన ప్రాంతంలో ఏర్పాటు చేస్తామన్నారు.