రాయచోటి వ్యాపారస్తులు అమరావతి నిర్మాణానికి, అన్నా క్యాంటీన్లు నిర్వహణ కొరకు అందించిన పది లక్షల రూపాయల విరాళం రాష్ట్ర రవాణా, యువజన క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ముఖ్యమంత్రికి అందజేశారు. సోమవారం అమరావతి లోని సచివాలయంలో మంత్రి మండిపల్లి ముఖ్యమంత్రిని కలిసి వ్యాపారస్తులు అందించిన 10 లక్షల రూపాయల చెక్కును అందజేశారు.